ముంబై:శ్రీలంకతో మూడు టీ 20ల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్లతో విజయం సాధించి ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. అదే సమయంలో 2017లొ అన్ని ఫార్మాట్లలో కలిసి సాధించిన విజయాల సంఖ్యను భారత్ 37కు పెంచుకుంది. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా టీమిండియా గుర్తింపు పొందింది. ఇక్కడ ఆస్ట్రేలియా 38 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. 2003లో ఆసీస్ 47 మ్యాచ్‌లు ఆడి 38 విజయాలను సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్థానాన్ని లంకేయులతో జరిగిన మూడో టీ 20లో గెలుపొందిన తరువాత టీమిండియా ఆక్రమించింది.
ఇదిలా ఉంచితే, ట్వంటీ 20 చరిత్రలో భారత జట్టు రెండుసార్లు మాత్రమే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2016లో ఆసీస్‌పై 3-0తో గెలిచిన టీమిండియా.. 2017లో శ్రీలంకపై మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఇదిలా ఉంచితే, ఒక ప్రత్యర్థిపై టీ 20ల్లో ఏడు వరుస విజయాలు సాధించి గత రికార్డును టీమిండియా సమం చేసింది. 2016-17 మధ్యకాలంలో శ్రీలంకపై భారత్‌కు ఇది వరుసగా ఏడు టీ 20 విజయం కాగా, 2013-17 మధ్య కాలంలో ఆసీస్‌పై భారత్ వరుస ఏడు టీ20 విజయాల్ని నమోదు చేసింది. ఇక్కడ పాకిస్తాన్ 9 వరుస విజయాలతో ముందు వరుసలో ఉంది. 2008-15 మధ్యలో జింబాబ్వేపై పాకిస్తాన్ వరుసగా తొమ్మిది విజయాలను సాధించింది.
2017లో భారత్..
టెస్టులు: ఆడినవి 11; విజయాలు7; పరాజయాలు;1 డ్రా 3
వన్డేలు:ఆడినవి 29; విజయాలు 21; పరాజయాలు7; నో రిజల్ట్ 1
టీ 20:ఆడినవి 13; విజయాలు 9; పరాజయాలు 4
ఓవరాల్:ఆడినవి 53; విజయాలు 37; పరాజయాలు 12
Comments
Please login to add a commentAdd a comment