భారత బౌలర్ల విజృంభణ
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు భారత బౌలర్ల విజృంభణ కొనసాగుతోంది. శనివారం మూడో రోజు ఆటలో లంచ్ లోపే ఏడు లంక వికెట్లను తీసి సత్తాచాటారు. 50/2 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక టాపార్డర్ ను కకావికలం చేసిన విరాట్ సేన మరింత ఆధిక్యం సాధించింది.
తొలుత ఓవర్ నైట్ ఆటగాళ్లు చండిమాల్(10), కుశాల్ మెండిస్(24) లను పెవిలియన్ కు పంపిన భారత్.. ఆపై ఏంజెలో మ్యాథ్యూస్(26), ధనంజయ డిసిల్వా(0),నిరోషాన్ డిక్ వెల్లా(51), రంగనా హెరాత్(2) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ కు పంపింది. దాంతో లంక జట్టు 152 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ప్రస్తుతం లంక కోల్పోయిన ఎనిమిది వికెట్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, షమీ, జడేజాలు తలో రెండు వికెట్లు తీశారు. ఉమేశ్ కు వికెట్ దక్కింది.