ఐపీఎల్ ప్రారంభోత్సవంలో ‘టీబీసీ’ బ్యాండ్ | Indian Premier League 2016: Katrina Kaif, Ranveer Singh to dazzle in glittering opening ceremony | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ ప్రారంభోత్సవంలో ‘టీబీసీ’ బ్యాండ్

Published Sat, Apr 2 2016 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

ఐపీఎల్ ప్రారంభోత్సవంలో   ‘టీబీసీ’ బ్యాండ్

ఐపీఎల్ ప్రారంభోత్సవంలో ‘టీబీసీ’ బ్యాండ్

ఈనెల 8 కార్యక్రమం

ముంబై: ఐపీఎల్-9 ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ నెల 8న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు తొలిసారి ఇంగ్లిష్ పాప్ బ్యాండ్ ‘టీబీసీ’ని రంగంలోకి దించుతున్నారు. అమ్మాయిలు మాత్రమే ఉండే ఈ బ్యాండ్ యూకేలో ఓ సంచలనం. గానంతో పాటు భిన్నమైన రీతుల్లో నృత్యం చేయడం ఈ బ్యాండ్ ప్రత్యేకత. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యోయో హనీ సింగ్, కత్రినా కైఫ్, రణ్‌వీర్ సింగ్‌లు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ కానున్నారు.

భారత్‌లో టీబీసీ ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారని కార్యక్రమ హక్కులను దక్కించుకున్న ఫెర్రిస్‌వీల్ ఎంటర్‌టైనమెంట్ తెలిపింది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో భారత్‌ను 360 డిగ్రీల కోణంలో చూపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 200 మంది డాన్సర్లు, రకరకాల ప్రదర్శనకారులు, పెద్ద మొత్తంలో జానపద కళాకారులు,  ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement