డేవిస్ కప్ మ్యాచ్ ఇండోర్‌లో | Indore to host India’s Davis Cup tie against Taipei | Sakshi
Sakshi News home page

డేవిస్ కప్ మ్యాచ్ ఇండోర్‌లో

Published Tue, Sep 24 2013 1:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM

Indore to host India’s Davis Cup tie against Taipei

న్యూఢిల్లీ: భారత్, చైనీస్ తైపీల మధ్య వచ్చే ఏడాది జరిగే ఆసియా ఓసియానియా గ్రూప్-1 మ్యాచ్‌కు ఇండోర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ టెన్నిస్ సంఘానికి (ఎంపీటీఏ) ఆతిథ్య హక్కులు ఇస్తూ అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే ఈ పోటీని హార్డ్ కోర్టులపై నిర్వహిస్తారు. ఈ నిర్ణయంపై ‘ఐటా’ సెలెక్షన్ కమిటీ చైర్మన్, ఎంపీటీఏ కార్యదర్శి కూడా అయిన అనిల్ ధూపర్ హర్షం వ్యక్తం చేశారు. ‘డేవిస్ కప్ మ్యాచ్‌ను తొలిసారి నిర్వహించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఎంపీటీఏ టెన్నిస్ కాంప్లెక్స్‌లో ఆరు సింథటిక్ ఫ్లడ్ కోర్టులు, జిమ్, స్విమ్మింగ్‌పూల్, వైద్య సౌకర్యాలు ఉన్నాయి. దేశంలో అతికొద్ది అసోసియేషన్లకే ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి’ అని అనిల్ ధూపర్ వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement