ముంబై : ఐపీఎల్‌లో నేడు మరో ఆసక్తికర పోరు. స్థానిక వాంఖడే స్టేడియంలో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)తో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సీఎస్‌కే జోరు మీదుండగా, ఒక మ్యాచ్‌లో గెలిచి రెండింట్లో పరాజయం పాలైన ముంబై ఇండియన్స్ జట్టు తిరిగి విజయాల బాట పట్టేందుకు ఎదురుచూస్తోంది.
గణాంకాలు ముంబై వైపే..
ఐపీఎల్‌లో సీఎస్‌కేకు మంచి రికార్డు ఉన్నప్పటికీ ముంబైతో మాత్రం ఆ జట్టుది పేలవ ప్రదర్శనే. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల గణంకాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఐపీఎల్‌లో ఈ రెండు జట్ల మధ్య ముఖా ముఖి పోరులో ముంబై 14, చెన్నై 12 గెలిచాయి. గత ఐదు మ్యాచ్‌ల్లో ముంబై ఏకంగా నాలిగింటిని సొంతం చేసుకోగా, సీఎస్‌కేకి ఒకటి మాత్రమే దక్కింది. ఈ ప్రకారం చూస్తే నేటి మ్యాచ్‌లో రోహిత్ సేనకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, గతేడాదిలాగే ఎక్కువ మంది వయసు మీరిన ఆటగాళ్లతో ‘డాడీస్ ఆర్మీ’గా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ సీజన్‌లోనూ సీఎస్‌కే అదర గొడుతోంది. ఫీల్డింగ్ మినహా అన్ని రంగాల్లోనూ మెరుగ్గా రాణిస్తోంది. కెప్టెన్ ధోనీ సైతం రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 46 బంతుల్లోనే 75 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ విభాగంలో ఇరు జట్లూ సమతూకంగా కనిపిస్తున్నా.. స్పిన్ బౌలింగ్‌లో మాత్రం చెన్నై మెరుగ్గా ఉంది. హర్భజన్, తాహిర్, జడేజాలతో పటిష్ఠంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment