
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2019 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే చెరో మూడు సార్లు ఐపీఎల్ టోర్నీ గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు మరోసారి కప్‌ను కైవసం చేసుకునేందుకు తలపడుతున్నాయి. మ్యాచ్ ఫలితాన్ని అమాంతం మార్చేసే బ్యాట్స్‌మెన్, ప్రత్యర్థిని కట్టిపడేసే బౌలర్లు, మెరుపు విన్యాసాల ఫీల్డర్లతో ఢీ అంటే ఢీ అనేలా ఇరుజట్లు ఉన్నాయి. అయితే సీఎస్‌కేపై లీగ్ దశలో రెండుసార్లు, క్వాలిఫయర్‌లో ఓసారి మొత్తం మూడు విజయాలతో గణాంకాల్లో ఈసారి ముంబైదే పై చేయి. మరి... ఇదే ఊపులో కెప్టెన్ రోహిత్ శర్మ బృందం కప్‌ను ఎగరేసుకుపోతుందో? ఈ పరాజయాలకు ‘మిస్టర్ కూల్’ ధోని జట్టు ఘనంగా ప్రతీకారం తీర్చుకుంటుందో? చూడాలి. మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ ఇవి..
Comments
Please login to add a commentAdd a comment