ఐపీఎల్‌ ఫైనల్‌: టాస్‌ గెలిచిన ముంబై | IPL 2019 Final Match Mumbai Opt To Bat First Against CSK | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ఫైనల్‌: ముంబైదే బ్యాటింగ్‌

Published Sun, May 12 2019 7:20 PM | Last Updated on Sun, May 12 2019 7:51 PM

IPL 2019 Final Match Mumbai Opt To Bat First Against CSK - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2019 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ వేశారు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న ఈ ఫైనల్‌ పోరులో టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌ ఒక మార్పు చేసింది. స్పిన్నర్‌ జయంత్‌ యాదవ్‌ను పక్కకుపెట్టిన ముంబై మిచెల​ మెక్లీన్‌గాన్‌కు అవకాశం కల్పించింది. ఫైనల్‌ పోరుకు సీఎస్‌కే ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. అయితే టాస్‌ అనంతరం ధోని మాట్లాడుతూ.. తాము టాస్‌ గెలిచినా ముందు బౌలింగే ఎంచుకునేవాళ్లమని తెలిపాడు. దీంతో మ్యాచ్‌పై మరింత ఉత్కంఠ రేపుతోంది.   

తుదిజట్లు: 
ముంబై: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషాన్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండా​, పొలార్డ్‌, మిచెల్‌ మెక్లీన్‌గాన్‌, రాహుల్‌ చహర్‌, బుమ్రా, మలింగ

సీఎస్‌కే: ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), డుప్లెసిస్‌, వాట్సన్‌, రైనా, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, డ్వేన్‌ బ్రేవో, దీపక్‌ చహర్‌, హర్భజన్‌ సింగ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement