
కోహ్లిని త్వరగా అవుట్ చేస్తే...
కోహ్లి అత్యుత్తమ ఆటగాడు. అందులో సందేహం లేదు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా భారత జట్టుకు అతను కీలక ఆటగాడు. అతని కోసం మా వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉంది. మేం అన్ని విధాలా సన్నద్ధమై వచ్చాం. కోహ్లిని త్వరగా అవుట్ చేస్తే మిగతా బ్యాట్స్‌మెన్‌పై తప్పకుండా ఒత్తిడి పెరుగుతుంది.
భారత్, పాక్ మ్యాచ్ అంటేనే ఉద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయని మాకు తెలుసు. గెలిపించిన వారు రాత్రికి రాత్రే హీరో అవుతారు. ఇతర విషయాలను పట్టించుకోకుండా కేవలం ఆటపైనే దృష్టి సారించాలని మా ఆటగాళ్లకు చెప్పాను. కానీ మైదానంలో రెండు జట్ల ఆటగాళ్లు స్నేహభావంతోనే ఆడతారు. ప్రస్తుతం ఒత్తిడి భారత్‌పైనే ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో మాకే మెరుగైన రికార్డు ఉంది. దాన్ని కొనసాగిస్తాం. – సర్ఫరాజ్ అహ్మద్, పాక్ కెప్టెన్