ఇర్ఫాన్‌ పఠాన్‌ కొత్త ఇన్నింగ్స్‌ | JKCA appoints Irfan Pathan as its coach cum mentor | Sakshi
Sakshi News home page

ఇర్ఫాన్‌ పఠాన్‌ కొత్త ఇన్నింగ్స్‌

Published Sat, Mar 31 2018 1:48 PM | Last Updated on Sat, Mar 31 2018 1:48 PM

JKCA appoints Irfan Pathan as its coach cum mentor - Sakshi

ఇర్పాన్‌ పఠాన్‌(ఫైల్‌ఫొటో)

జమ్మూ కశ్మీర్‌: భారత క్రికెట్‌ జట్టు వెటరన్‌ ఆల్‌ రౌండర్‌ ఇర్పాన్‌ పఠాన్‌ కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. ఇక నుంచి కోచ్‌ పాత్రలో మెరిసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.  ఈ మేరకు జమ్మూ కశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌తో ఒప్పందం చేసుకున్నాడు.  

2018-19 సీజన్‌కు ఇర్ఫాన్‌ పఠాన్‌ను కోచ్‌, మెంటార్‌గా నియమించిన విషయాన్ని జేకేసీఏ వెల్లడించింది. తమ జట్టుకు ఏడాది పాటు ఇర్పాన్‌ కోచ్‌గా, మెంటార్‌గా సేవలందించనున్నట్లు జేకేసీఏ సీఈవో ఆషిక్‌ బుఖారి తెలిపారు.గత రెండు దేశవాళీ సీజన్‌లో బరోడాకు కెప్టెన్‌గా చేసిన ఇర్పాన్‌.. 2003-12 కాలంలో భారత్‌ తరపున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 అంతర్జాతీయ టీ20లు ఆడాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement