వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ సాధించిన తర్వాత మన్‌జోత్ కల్రా అభివాదం
మౌంట్ మాంగనీ: అండర్-19 వరల్డ్ కప్‌ను భారత్ సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన ఓపెనర్ మన్‌జోత్ కల్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో భాగంగా తుది పోరులో శతకం సాధించిన రెండో భారత క్రికెటర్‌గా మన్‌జోత్ నిలిచాడు. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మన్‌జోత్(101 నాటౌట్) అజేయ శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఉన్ముక్త్ చంద్ తర్వాత సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.
2012లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఆటగాడు ఉన్ముక్త్ చంద్ శతకం సాధించాడు. ఆ తర్వాత మెగా పోరు ఫైనల్లో శతకం సాధించిన టీమిండియా ఆటగాడు మన్‌జోత్ కల్రానే. ఓవరాల్‌గా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ సాధించిన ఐదో ఆటగాడు మన్‌జోత్.1988 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ ఆటగాడు బ్రెట్ విలియమ్స్ శతకం సాధించి తొలి ఆటగాడిగా నిలవగా, 1998 తుది పోరులో ఇంగ్లండ్ ఆటగాడు స్టీఫెన్ పీటర్స్ సెంచరీ సాధించాడు. 2002లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ ఆటగాడు జారడ్ బర్క్ శతకం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment