
గోవాపై నెగ్గిన కేరళ
ఐఎస్‌ఎల్
కొచ్చి: సొంత మైదానంలో ఆడిన తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ సత్తా చూపింది. గురువారం స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఎఫ్‌సీ గోవాతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో నెగ్గింది. స్ట్రయికర్ మిలాగ్రెస్ గొంజాల్వెస్ (64వ నిమిషంలో) కేరళ తరఫున ఏకైక గోల్ సాధించాడు. దీంతో ఏడు పాయింట్లతో కేరళ తన చివరి స్థానాన్ని మెరుగుపరుచుకోగా పుణే నాలుగు పాయింట్లతో అట్టడుగున నిలిచింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన భార్య అంజలితో కలిసి వచ్చి ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించాడు.