లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఓటమి నుంచి తప్పించుకునేందుకు భారత్ తీవ్రంగా పోరాడుతోంది. 464 పరుగుల భారీ లక్ష్యంతో చివరి రోజు బరిలోకి దిగిన భారత్.. లంచ్ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (116, 136 బంతుల్లో 17 పోర్లు, 1 సిక్సు)తో వీరోచితంగా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కళ్లుచెదిరే షాట్లతో అలరించిన రాహుల్ ఈ సీరిస్‌లో తొలి శతకం నమోదు చేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో రాహుల్‌తో పాటు, రిషబ్ పంత్ (18) క్రీజ్‌లో ఉన్నాడు.
మొదటి ఇన్సింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన విహారి రెండో ఇన్సింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరిశపరిచాడు. రహానే 37 పరుగులుతో కొంతసేపు రాహుల్‌కు అండగా నిలిచాడు. భారత్ ఇంకా 285 పరుగులు వెనుకబడి ఉంది. ఈ తరుణంలో చివరి టెస్ట్‌ను కనీసం డ్రాతో ముగించాలని టీమిండియా పోరాడుతోంది. ప్రధాన బ్యాట్సమెన్ అందరూ అవుట్ కావడంతో టెయిలెండర్లు ఎంత మేరకు నిలుస్తారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment