ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ ఈడెన్ గార్డెన్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్ లో కోల్ నైట్ రైడర్స్ 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ ఈడెన్ గార్డెన్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్ లో కోల్ నైట్ రైడర్స్ 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా ఆదిలో తడబడింది. ఓపెనర్లలో రాబిన్ ఉతప్ప(25) మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, గౌతం గంభీర్(16) నిరాశపరిచాడు. ఆ తరువాత కోలిన్ మున్రో(10) అవుట్ కావడంతో కోల్ కతా 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ తరుణంలో మనీష్ పాండే-యూసఫ్ పఠాన్ జోడి ఆదుకుంది. ఈ జోడి నాల్గో వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన అనంతరం మనీష్ (48;30 బంతుల్లో 2 ఫోర్లు, 3 ఫోర్లు) పెవిలియన్ కు చేరాడు. ఆపై యూసఫ్ పఠాన్(52 నాటౌట్;34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో కోల్ కతా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, దీపక్ హూడా తలో రెండు వికెట్లు తీయగా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, బరిందర్ శ్రవణ్ లో చెరో వికెట్ దక్కింది.