బోపన్న- కుబోట్ జంట ముందంజ | Leading kubot couple bopanna | Sakshi
Sakshi News home page

బోపన్న- కుబోట్ జంట ముందంజ

Published Sat, Oct 17 2015 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

Leading kubot couple bopanna

షాంఘై: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన భాగస్వామి లుకాస్ కుబోట్ (పోలండ్)తో కలిసి షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న-కుబోట్ ద్వయం 6-4, 7-5తో మాక్స్ మిర్నీ (బెలారస్)-ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్) జంటపై గెలిచింది.

సెమీస్‌లో మార్సెలో మెలో (బ్రెజిల్)-రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జోడీతో బోపన్న జంట ఆడుతుంది. ఇదే టోర్నీలో లియాండర్ పేస్ (భారత్)-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంట తొలి రౌండ్‌లోనే ఓడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement