
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్–50లోకి వచ్చాడు. గతవారం దుబాయ్ ఓపెన్‌లో జేమీ సెరెటాని (అమెరికా)తో కలిసి రన్నరప్‌గా నిలవడంతో పేస్ ఆరు స్థానాలు పురోగతి సాధించాడు.
సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అతడు 46వ స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన రోహన్ బోపన్న 20వ ర్యాంక్‌లో, దివిజ్ శరణ్ 44వ ర్యాంక్‌లో ఉన్నారు. సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ 110వ స్థానంలో ఉన్నాడు.