కొట్టిందొకడు.. గెలిచిందొకడు!
రియో: ఒలింపిక్స్ బాంటమ్‌వెయిట్ బాక్సింగ్ క్వార్టర్స్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇరాన్ బాక్సర్ మైకేల్ కోన్లన్‌కు.. రష్యా బాక్సర్ వ్లాదిమిర్ నికితిన్‌కు మధ్య బౌట్ జరిగింది. ప్రత్యర్థిపై మైకేల్ పంచ్‌ల వర్షం కురిపించి రక్తం వచ్చేలా కొట్టాడు. దీంతో మైకేల్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు.
కానీ జడ్జీలు మాత్రం వ్లాదిమిర్ గెలిచినట్లు ప్రకటించారు. దీంతో చిర్రెత్తిన ఇరాన్ బాక్సన్ అక్కడికక్కడే జడ్జీలను, ఏఐబీఏను బండ బూతులు తిట్టాడు. బంగారు పతకం గెలవాలన్న తన ఆశలపై నీళ్లు చల్లారని, తనను మోసం చేశారని ధ్వజమెత్తాడు.