సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ సెమీస్ పోరులో టీమిండియా పరాజయం పాలవడానికి టాస్ ఓడిపోవడం ప్రధాన కారణమని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. టాస్ గెలవకపోవడమే టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ అని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాకు అనుకూలంగా టాస్ పడడంతో తన హృదయ స్పందన ఆగినంత పనైందని పేర్కొన్నాడు. ముందుగా బ్యాటింగ్ చేయడం ఆసీస్ కు కలిసి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే అన్నాడు. భారత బౌలర్లు బాగానే బౌలింగ్ చేసినప్పటికీ బ్యాట్స్ మెన్ నుంచి మద్దతు కరువవడంతో మ్యాచ్ చేజారిందని విశ్లేషించాడు.
'టాస్ ఓడిపోవడం ఎదురుదెబ్బ'
Published Fri, Mar 27 2015 9:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM
Advertisement
Advertisement