జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని ప్రాక్టీస్ భిన్నంగా సాగుతోంది. మంగళవారం జరిగిన నెట్ సెషన్‌లో మహీ... ఎర్రటి కూకబురా బంతులతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. మామూలుగా వన్డే మ్యాచ్‌లకు ఉపయోగించే తెల్ల బంతులతోనే ఎవరైనా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తారు. కానీ మహీ దీనికి భిన్నంగా చేశాడు.
రెండో ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని... కొద్దిసేపు స్పిన్నర్లు, ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీ వేసిన బంతులను ఎదుర్కొని సాధన చేశాడు. ఇక సెషన్ ముగిసిందనుకున్న దశలో మళ్లీ ప్యాడ్లు కట్టుకొని నెట్‌లోకి వచ్చాడు. నెట్ వెనకాల కోచ్ ఫ్లెచర్, జట్టు విశ్లేషకుడు ధనంజయ్‌లు కూర్చొని ఉండగా కూకబురా బంతులతో అరగంట పాటు ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ కొనసాగినంతసేపు ఫ్లెచర్.. మహీకి సూచనలు చేస్తూనే ఉన్నాడు. కవర్స్‌లో వేగంగా కదలడంపై ఎక్కువగా దృష్టిసారించినట్లు కనిపించింది.
కూకబురా బంతులతో బ్యాటింగ్ ప్రాక్టీస్
Published Wed, Dec 4 2013 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
Advertisement
Advertisement