షరపోవా x సిమోనా | Maria Sharapova sets up French Open final date with Simona Halep | Sakshi
Sakshi News home page

షరపోవా x సిమోనా

Published Sat, Jun 7 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

షరపోవా   x సిమోనా

షరపోవా x సిమోనా

సాయంత్రం గం. 6.30 నుంచి
 నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 గత ఆరేళ్లుగా ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరిస్తోంది. ఆ ఆనవాయితీ ఈ ఏడాదీ కొనసాగుతుందా? లేదంటే మాజీ విజేత షరపోవా రెండోసారి టైటిల్ సాధిస్తుందో ఈ రోజు తేలిపోనుంది.
 
  వరుసగా మూడో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన షరపోవా (రష్యా) కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడనున్న సిమోనా హలెప్ (రుమేనియా)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్ చేరే క్రమంలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని సిమోనా అదే జోరును అంతిమ పోరులోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. కెరీర్‌లో సిమోనాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన షరపోవా అలాంటి ఫలితాన్ని మరోసారి పునరావృతం చేయాలనే కృతనిశ్చయంతో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement