
లెస్టర్: ముక్కోణపు క్రికెట్ టోర్నీలో ఇంగ్లండ్ ‘ఎ’తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు 102 పరుగులతో నెగ్గింది. మయాంక్ అగర్వాల్ మరో సెంచరీ (112; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో చెలరేగగా... శుబ్‌మన్ గిల్ (72; 10 ఫోర్లు, 1 సిక్స్), ఆంధ్ర ఆటగాడు విహారి (69; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఫలితంగా భారత్ ‘ఎ’ 50 ఓవర్లలో 6 వికెట్లకు 309 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ ‘ఎ’ 41.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment