
చెన్నై విజయలక్ష్యం 188
ముంబై: ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 188 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకు ఓపెనర్లు శుభారంభం అందించారు. సిమ్మన్స్(65), పార్థీవ్ పటేల్(35)పరుగులు చేశారు. అనంతరం పాండ్యా(1), రోహిత్ శర్మ(19) లు ఆకట్టుకోలేకపోయారు. అయితే పొలార్డ్(41), అంబటి రాయుడు (10), హర్భజన్(6), సుచిత్(1) పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రేవో మూడు వికెట్లు తీయగా, నెహ్రా, జడేజా,మోహిత్ శర్మలకు తలో వికెట్ లభించింది.