ముంబై ‘విన్’డియన్స్ | Mumbai Magic | Sakshi
Sakshi News home page

ముంబై ‘విన్’డియన్స్

Published Wed, May 20 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

ముంబై ‘విన్’డియన్స్

ముంబై ‘విన్’డియన్స్

ఐపీఎల్ ఫైనల్‌కు ముంబై ఇండియన్స్
క్వాలిఫయర్-1లో చెన్నైపై విజయం
చెలరేగిన సిమ్మన్స్, పొలార్డ్
 

 ఆ జట్టేనా ఇది..! టోర్నీలో వరుసగా ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌లూ ఓడిన జట్టు... కోల్‌కతా చేతిలో ఓటమి అంచుల్లోంచి తేరుకుని ప్లే ఆఫ్ రేసులో నిలబడ్డ జట్టు... ఐపీఎల్‌లో ముందే ఫైనల్‌కు చేరింది. వరుస విజయాలతో జోరుమీదున్న ముంబై ఇండియన్స్... క్వాలిఫయర్-1లో పటిష్టమైన చెన్నైని మట్టికరిపించింది. సిమ్మన్స్, పొలార్డ్‌ల బ్యాటింగ్ మెరుపులకు... బౌలర్ల సమష్టి కృషి తోడవడంతో రోహిత్‌సేన ఆదివారం జరిగే ఫైనల్‌కు బెర్త్ ఖరారు చేసింది. అటు చెన్నై ఈ మ్యాచ్ ఓడినా ఫైనల్‌కు చేరే అవకాశం మిగిలే ఉంది. నేడు జరిగే ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో ధోనిసేన తలపడుతుంది.
 
 ముంబై : ఏమాత్రం ఉత్కంఠ లేదు.. నువ్వా? నేనా? అనే రీతిలో సాగుతుందనుకున్న సమఉజ్జీల సమరం పూర్తిగా ఏకపక్షంగా సాగింది. అనూహ్య ఆటతీరుతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్ సొంత మైదానంలో మరోసారి చెలరేగింది. ఆల్‌రౌండ్ షోతో సగర్వంగా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మంగళవారం వాంఖడే మైదానంలో జరిగిన తొలి ప్లే ఆఫ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 25 పరుగుల తేడాతో మట్టికరిపించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 187 పరుగులు చేసింది.

లెండిల్ సిమ్మన్స్ (51 బంతుల్లో 65; 3 ఫోర్లు; 5 సిక్సర్లు), పార్థీవ్ పటేల్ (25 బంతుల్లో 35; 4 ఫోర్లు; 1 సిక్స్) రాణించగా... చివర్లో పొలార్డ్ (17 బంతుల్లో 41; 1 ఫోర్; 5 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్రేవోకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డు ప్లెసిస్ (34 బంతుల్లో 45; 5 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్. మలింగకు మూడు, హర్భజన్, వినయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

 ఆరంభం, ముగింపు అదుర్స్: ముంబైకి ఓపెనర్లు శుభారంభం అందించారు. అశ్విన్ వేసిన ఐదో ఓవర్‌లో సిమ్మన్స్ రెండు భారీ సిక్స్‌లతో ఊపు తెచ్చాడు. నేగి వేసిన తొమ్మిదో ఓవర్‌లో పార్థీవ్ దూకుడుగా ఆడి 6,4,4తో మొత్తం 16 పరుగులు రాబట్టాడు. అటు సిమ్మన్స్ 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని డ్వేన్ బ్రేవో విడదీశాడు. స్లో బంతిని ఆడబోయిన పార్థీవ్ లాంగ్ ఆన్‌లో జడేజాకు చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

కొద్ది సేపటికే సిమ్మన్స్ కూడా జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. బ్రేవో తన మరుసటి ఓవర్‌లో మరో స్లో బంతికి కెప్టెన్ రోహిత్ (14 బంతుల్లో 19; 1 ఫోర్; 1 సిక్స్)ను వెనక్కి పంపాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే హార్ధిక్ పాండ్యా (1)ను నెహ్రా అవుట్ చేయడంతో ముంబై ఇబ్బందుల్లో పడింది. అయితే పొలార్డ్ మాత్రం నేగి బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, బ్రేవో బౌలింగ్‌లో ఓ సిక్స్‌తో ఆకట్టుకున్నాడు. రాయుడు (8 బంతుల్లో 10; 1 ఫోర్) విఫలమైనా...  పొలార్డ్ జోరుకు ఆఖరి మూడు ఓవర్లలో 46 పరుగులు వచ్చాయి.

 వరుస విరామాల్లో వికెట్లు : భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన చెన్నైకి తొలి ఓవర్‌లోనే అంపైర్ తప్పిదంతో షాక్ ఎదురైంది. మలింగ వేసిన బంతి లెగ్‌సైడ్‌కు ఆవల డ్వేన్ స్మిత్ ప్యాడ్లకు తగిలినప్పటికీ అంపైర్ దాన్ని ఎల్బీగా ప్రకటించాడు. ఇన్నింగ్స్ ఆరో  ఓవర్‌లో వినయ్.. హస్సీ (11 బంతుల్లో 16; 1 ఫోర్; 1 సిక్స్)ని అవుట్ చేశాడు. మధ్య ఓవర్లలో ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బంతులకు పరుగులు రావడం కష్టమయ్యాయి.

తొమ్మిదో ఓవర్‌లో రైనా సిక్స్, డు ప్లెసిస్ ఫోర్‌తో 13 పరుగులు వచ్చాయి. అయితే 11వ ఓవర్‌లో హర్భజన్ వరుస బంతుల్లో రైనా (20 బంతుల్లో 25; 2 సిక్సర్లు), ధోనిని పెవిలియన్‌కు చేర్చాడు.  14వ ఓవర్‌లో డు ప్లెసిస్ అవుట్ కావడంతో చెన్నై మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. చివరి ఐదు ఓవర్లలో 67 పరుగులు కావాల్సిన దశలో ఏమాత్రం పోరాడలేకపోయింది. అశ్విన్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు; 1 సిక్స్) కాసేపు పోరాడినా... ఈ సీజన్‌లో చెన్నై తొలిసారి ఆలౌట్ కాకుండా ఆపలేకపోయాడు.
 
 స్కోరు వివరాలు : ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) నేగి (బి) జడేజా 65; పార్థీవ్ (సి) జడేజా (బి) బ్రేవో 35; రోహిత్ (సి) జడేజా (బి) బ్రేవో 19; పొలార్డ్ (సి) రైనా (బి) బ్రేవో 41; పాండ్య (సి) జడేజా (బి) నెహ్రా 1; రాయుడు (సి) రైనా (బి) మోహిత్ 10; హర్భజన్ నాటౌట్ 6; సుచిత్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 187.
వికెట్ల పతనం : 1-90, 2-113, 3-137, 4-139, 5-164, 6-185.
 బౌలింగ్ : అశ్విన్ 3-0-22-0; నెహ్రా 4-0-28-1; నేగి 4-0-46-0; జడేజా 2-0-18-1; మోహిత్ 3-0-33-1; బ్రేవో 4-0-40-3.

 చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) మలింగ 0; హస్సీ (సి) పార్థీవ్ (బి) వినయ్ 16; డు ప్లెసిస్ (సి) వినయ్ (బి) సుచిత్ 45; రైనా (సి అండ్ బి) హర్భజన్ 25; ధోని ఎల్బీడబ్ల్యు (బి) హర్భజన్ 0; బ్రేవో (రనౌట్) 20; జడేజా (సి) సుచిత్ (బి) మెక్లెనెగాన్ 19; నేగి (సి) సబ్ ఉన్ముక్త్ (బి) వినయ్ 3; అశ్విన్ (సి) రాయుడు (బి) మలింగ 23; మోహిత్ నాటౌట్ 3; నెహ్రా (సి) సిమ్మన్స్ (బి) మలింగ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 162.
 వికెట్ల పతనం : 1-0, 2-46, 3-86, 4-86, 5-110, 6-119, 7-126, 8-147, 9-161, 10-162.
 బౌలింగ్ : మలింగ 4-0-23-3; మెక్లెనెగన్ 3-0-46-1; వినయ్ 3-0-26-2; హర్భజన్ 4-0-26-2; పొలార్డ్ 3-0-22-0; సుచిత్ 2-0-18-1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement