ఫెడరర్ 21వ సారి...
ఫెడరర్ 21వ సారి...
Published Sun, Aug 18 2013 1:35 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
సిన్సినాటి: ఈ ఏడాది ఒక్క సింగిల్స్ టైటిల్ మాత్రమే నెగ్గిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెడరర్ నిరాశజనక ఫ్రదర్శన కొనసాగుతోంది. గతంలో ఆరుసార్లు సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెల్చుకున్న ఈ స్విట్జర్లాండ్ దిగ్గజం ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించాడు. తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 7-5, 4-6, 3-6తో ఓడిపోయాడు. నాదల్‌తో 31వ సారి తలపడిన ఫెడరర్‌కిది 21వ పరాజయం కావడం గమనార్హం.
మరోవైపు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే (బ్రిటన్) కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టారు. జొకోవిచ్ గనుక సిన్సినాటి టైటిల్ గెలిచిఉంటే అన్ని మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించేవాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో ‘అమెరికా ఆజానుబాహుడు’ జాన్ ఇస్నెర్ 7-6 (7/5), 3-6, 7-5తో జొకోవిచ్‌ను బోల్తా కొట్టించాడు. మరో మ్యాచ్‌లో బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-3, 6-4తో ఆండీ ముర్రేను ఓడించాడు.
Advertisement