జాతీయ జూనియర్‌ చెస్‌ చాంప్‌ హర్ష | National Junior Chess Champ Harsha | Sakshi
Sakshi News home page

జాతీయ జూనియర్‌ చెస్‌ చాంప్‌ హర్ష

Sep 12 2017 12:35 AM | Updated on Sep 19 2017 4:22 PM

జాతీయ జూనియర్‌ చెస్‌ చాంప్‌ హర్ష

జాతీయ జూనియర్‌ చెస్‌ చాంప్‌ హర్ష

జాతీయ జూనియర్‌ అండర్‌–19 ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆటగాడు హర్ష భరతకోటి విజేతగా నిలిచాడు.

పట్నా: జాతీయ జూనియర్‌ అండర్‌–19 ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆటగాడు హర్ష భరతకోటి విజేతగా నిలిచాడు. 11 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో అతను 9.5 పాయింట్లతో అజేయంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్తీక్‌ వెంకట రామన్‌ కూడా సరిగ్గా 9.5 పాయింట్లు సాధించాడు. అయితే ఈ టోర్నీలో అతనిపై ముఖాముఖి పోరులో అంతర్జాతీయ మాస్టర్‌ (ఐఎమ్‌) హర్ష గెలుపొందడంతో అతడిని విజేతగా డిక్లేర్‌ చేశారు.

దీంతో కార్తీక్‌ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో టాప్‌–5 స్థానాలు తెలుగు ఆటగాళ్లవే కావడం విశేషం. ఏపీ క్రీడాకారులు కృష్ణతేజ (8), ప్రణవానంద (8) వరుసగా మూడు, నాలుగు స్థానాలు పొందగా, రాజా రిత్విక్‌ (తెలంగాణ) ఐదో స్థానంలో నిలిచాడు. బాలికల కేటగిరీలో మహాలక్ష్మి (తమిళనాడు) చాంపియన్‌గా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement