జాతీయ కరాటే పోటీలు ప్రారంభం | national karate competitions started | Sakshi
Sakshi News home page

జాతీయ కరాటే పోటీలు ప్రారంభం

Published Sat, Nov 5 2016 10:47 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

national karate competitions started

హైదరాబాద్: ఏఐబీకేఎఫ్ జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి పద్మారావు శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీల్లో పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరాటే అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని క్రీడాశాఖ మంత్రి పద్మారావు అన్నారు. కరాటే అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా ఆయన 2 లక్షల విరాళం ప్రకటించగా... ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఐఎం నేత శ్రీశైలం యాదవ్ కరాటే సంఘానికి లక్ష రూపాయల విరాళం అందించారు.

 

ఆత్మవిశ్వాసానికి, దృఢచిత్తానికి, మనోబలానికి కరాటే ఎంతో ఉపకరిస్తుందని బూడోకాన్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సుమన్ అన్నారు. తమ సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement