పోచారం: జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 18 వరకూ 16వ జాతీయ మాన్సూన్ క్యాంప్‌ను చత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్ నగరంలో నిర్వహించారు. క్యాంపులో ముఖ్య అతిథిగా జపాన్ హెడ్ క్వార్టర్స్ నుండి మాస్టర్ షిహాన్ తుకుయ తనియమ, ఇండియన్ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ షహన్ ఆనంద రత్న, తెలంగాణ రాష్ట్ర చీఫ్ రాపోలు సుదర్శన్ పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్పోర్ట్స్ కరాటే అకాడమీ తరపున పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడకు చెందిన గుగులోత్ గోవింద్ నాయక్ హాజరయ్యారు.
ఈ శిబిరంలో తకుయ తనియమ చేతులమీదుగా ఇంటర్నేషనల్ టెక్నికల్ లైసెన్స్‌డ్ ఎగ్జామినర్ సరి్టఫికెట్‌ను గోవింద్ నాయక్ అందుకున్నారు. కోర్సు సిలబస్‌ను పూర్తిచేయడంతో పాటు అద్భుతమైన కరాటే నైపుణ్యాలను గోవింద్ ప్రదర్శించి అతిథుల ప్రశంసలు పొందారు. సమాజంలో చోటుచేసుకునే అరాచకాల నుండి రక్షించుకోవడానికి కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గోవింద్ అన్నారు. తల్లిదండ్రులు ఆడబిడ్డలకు ఆత్మరక్షణ కోసం కరాటే వంటి యుద్ధ విద్యలు నేరి్పంచాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment