కష్టాల్లో కివీస్..సెంచరీ చేజార్చుకున్న విలియమ్సన్
కార్డిఫ్: చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఎలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్ లోన్యూజిలాండ్ తడబడుతుంది. జేమ్స్ బాల్ 2 వికెట్లు పడగొట్టడంతో కివీస్ 34 ఓవర్లకు నాటుగు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఆదిలోనే ఓపెనర్ రోంచి డకౌట్‌తో ఎదురు దెబ్బ తగిలింది. మరో ఓపెనర్ గప్టిల్, కెప్టెన్ విలియమ్సన్‌తో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసిన స్టోక్స్ అడ్డుకున్నాడు.
రోంచి(27; 4 ఫోర్లు) అవుటవ్వడంతో వీరి 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్‌తో విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ తరుణంలో 66 బంతుల్లో విలియమ్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడిన విలియమ్సన్ (87; 98 బంతులు, 8 ఫోర్లు) సెంచరీ చేజార్చుకున్నాడు. వెంటనే టేలర్(39; 3 ఫోర్లు) కూడా అవుటవ్వడంతో కివీస్ 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో నీల్ బ్రూమ్(4), జేమ్స్ నీషమ్(1)లు పోరాడుతున్నారు.