![Novak Djokovic beats Rafael Nadal to reach Wimbledon final - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/15/NADAL-JOKOVIC.jpg.webp?itok=PWv3xgCW)
ఇద్దరు మాజీ చాంపియన్స్ మధ్య సుదీర్ఘంగా సాగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పైచేయి సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో శనివారం జరిగిన సెమీఫైనల్లో 12వ సీడ్ జొకోవిచ్ 6–4, 3–6, 7–6 (11/9), 3–6, 10–8తో గెలుపొందాడు. 5 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 23 ఏస్‌లు సంధించి, నాదల్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో జొకోవిచ్ తలపడతాడు.
2011, 2014, 2015లలో జొకోవిచ్ వింబుల్డన్ చాంపియన్‌గా నిలువగా... అండర్సన్ తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. శుక్రవారమే నాదల్, జొకోవిచ్ సెమీఫైనల్ ముగియాల్సింది. అయితే అండర్సన్, జాన్ ఇస్నెర్ (అమెరికా) మధ్య తొలి సెమీఫైనల్ 6 గంటల 36 నిమిషాలపాటు సాగడంతో నాదల్, జొకోవిచ్ రెండో సెమీఫైనల్ ఆలస్యంగా ప్రారంభమైంది. మరోవైపు రాత్రి 11 తర్వాత ఆటను నిలిపివేయాలని వింబుల్డన్ టోర్నీ నిబంధనలు చెబుతున్నాయి. అప్పటికి జొకోవిచ్ 6–4, 3–6, 7–6 (11/9)తో ఆధిక్యంలో ఉండటం... ఫలితం రాకపోవడంతో మ్యాచ్‌ను శనివారం కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment