పాకిస్తాన్దే సిరీస్ | pakistan won the series against west indies | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్దే సిరీస్

Published Mon, May 15 2017 2:52 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

పాకిస్తాన్దే సిరీస్

పాకిస్తాన్దే సిరీస్

రొసియూ (డొమినికా): వెస్టిండీస్ తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టెస్టులో పాకిస్తాన్ 101 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ మరోసారి అద్భుతంగా రాణించి ఐదు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. యాసిర్ దెబ్బకు 304 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ 202 పరుగులకే చాపచుట్టేసింది. యాసిర్ కు జతగా హసన్ అలీ మూడు వికెట్లు సాధించాడు.

విండీస్ రెండో ఇన్నింగ్స్ రోస్టన్ ఛేజ్(101 నాటౌట్;239 బంతుల్లో 12 ఫోర్లు, 1సిక్సర్) సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. అతనికి మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం లభించకపోవడంతో విండీస్ కు ఘోర ఓటమి తప్పలేదు. ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో విండీస్ కు పరాజయం తప్పలేదు. ఈ సిరీస్ లో తొలి టెస్టును పాకిస్తాన్ గెలవగా, రెండో టెస్టులో విండీస్ విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement