
జమైకా: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. కింగ్‌స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆతిథ్య వెస్టిండీస్‌పై 109 పరుగులతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది 10 వికెట్లతో( తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు) దుమ్మురేపి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
చదవండి: ENG Vs IND: రెండో విజయమే లక్ష్యంగా...
ఆట ఐదో రోజులో భాగంగా 49/1 క్రితం రోజు స్కోరుతో బరిలోకి దిగిన విండీస్ పాక్ బౌలర్ల దాటికి 219 పరుగులకు ఆలౌట్ అయింది. జాసన్ హోల్డర్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కైల్ మేయర్స్ 32, కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 39 పరుగులు చేశారు. షాహిన్ అఫ్రిది 4, హసన్ అలీ 2, నుమాన్ అలీ 3 వికెట్లు తీశారు. అంతకముందు పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. అనంతరం విండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ కావడంతో పాక్‌కు 152 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌ను పాక్ 176 పరుగుల వద్ద డిక్లేర్ చేసి విండీస్ ముందు 329 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. ఇక తాజా విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
చదవండి: Taliban Controversy: రాజస్తాన్ క్రికెట్‌లో 'తాలిబన్' జట్టు కలకలం