
కోహ్లీని ఇచ్చేయండి.. మా జట్టును తీసుకోండి!
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ నెగ్గడాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందులో భాగంగా పాక్ జర్నలిస్ట్ నజరానా గఫర్ చేసిన ట్వీట్ విపరీతంగా రీట్వీట్ అయ్యి వైరల్‌గా మారింది. పాక్ పై 124 పరుగుల తేడాతో భారత్ నెగ్గిన అనంతరం గఫర్.. 'పాకిస్తాన్‌కు కోహ్లీని ఇచ్చేయండి. అందుకు పాక్ జట్టును మొత్తాన్ని భారత్ తీసుకోవచ్చు. ఓ ఏడాదిపాటు ఇలా జరిగితే బాగుండేదని' పేర్కొన్నారు.
దీనిపై భారతీయులు తీవ్రంగా స్పందిస్తూ పాక్ జర్నలిస్టుకు ఘాటు బదులిచ్చారు. 'దయచేసి గాడిదలను, గుర్రాలతో పోల్చవద్దు. పాక్ క్రికెటర్లు వచ్చే రెండు తరాలయినా టీమిండియాతో పోల్చడానికి సరిరారని' శ్రీకాంత్ పంకజ్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. అప్పడు కాశ్మీర్.. ఇప్పుడు కోహ్లీనా.. పాక్ ప్రజలకు 'కే' ఎప్పుడూ చేరువకాదు. కాశ్మీర్, కోహ్లీలను మీరు ఎప్పటికీ పొందలేరని గుజరాత్‌కు చెందిన చింకీ అనే యువతి ట్వీట్‌లో పేర్కొన్నారు. పాక్ జర్నలిస్ట్ ట్వీట్లపై ఇప్పటికీ భారత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
@BeingHooked please don't compare horses and donkeys. Even your next 2 generation of cricketers combined won't match him.
— Shreekanth Pankaj (@ShreekantPankaj) 4 June 2017
Hahaha.. 'K'ashmir.. Fir 'K'ohli.. You people r obsessed with 'K'.. Bur sry folks.. U cannot get either of them! :p ;)
— !!Chinky!! (@gathashrimali) 5 June 2017