షా.. కొంచెం సెహ్వాగ్‌ కొంచెం సచిన్‌ | Prithvi Shaw Gets The Ultimate Compliments From Legend Cricketers  | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 5 2018 9:00 AM | Last Updated on Fri, Oct 5 2018 9:06 AM

Prithvi Shaw Gets The Ultimate Compliments From Legend Cricketers  - Sakshi

పృథ్వీ షా

రాజ్‌కోట్‌: అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ బాది టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా నిలిచిన యువకెరటం పృథ్వీ షాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దిగ్గజ క్రికెటర్లు సైతం ఈ యువ ఆటగాడి ఆటను చూసి సంబరపడిపోతున్నారు. టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి అయితే షాలో కొంచెం సెహ్వాగ్‌ కొంచెం సచిన్‌ ఉన్నాడని ట్వీట్‌ చేశాడు. ‘అద్భుతంగా ఆడావు యంగ్‌మన్ పృథ్వీషా‌.. అరంగేట్ర మ్యాచ్‌లో భయం లేకుండా అద్భుత ప్రదర్శన కనబర్చావు. నీలో కొంచెం సెహ్వాగ్‌ కొంచెం సచిన్‌లున్నారు’ అని కొనియాడుతూ ఆకాశానికెత్తాడు. (చదవండి: కేఎల్‌ రాహుల్‌.. మళ్లీనా?)

భారత దిగ్గజం మాస్టర్‌ బ్లాస్టర్‌ ‘ నీ తొలి ఇన్నింగ్స్‌లో నువ్విలా దాడి చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంది. ఇలానే భయంలేకుండా నీ ఆటను కొనసాగించు’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను చూసి పృథ్వీషా ఆనందంలో ఉబ్బితబ్బిపోయాడు. తన ఆరధ్య ధైవమైన సచిన్‌ తనను ప్రశంసించడం ఓ మధురానుభృతి అని పేర్కొన్నాడు. అలాగే తనకు విషెస్ చెబుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. ‘ఇది పూర్తిగా షా షో.. అభినందనలు పృథ్వీషా.. ఇప్పుడు ఇది ఆరంభం మాత్రమే.. ఈ కుర్రాడిలో ఇంకా చాలా దమ్ముంది’ అని సెహ్వాగ్‌ కొనియాడాడు. భారత్‌ నుంచి మరో సూపర్‌ స్టార్‌ వెలుగులోకి వచ్చాడని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌ ప్రశంసించాడు. ఇక భారత మాజీ ఆటగాళ్లు కైఫ్‌, హర్భజన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు సైతం షా ప్రదర్శనను కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. (చదవండి: పృథ్వీ ‘షా’న్‌దార్‌ )

అరంగేట్ర కుర్రాడు పృథ్వీ షా (154 బంతుల్లో 134; 19 ఫోర్లు) దూకుడైన శతకానికి తోడు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా (130 బంతుల్లో 86; 14 ఫోర్లు); కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (137 బంతుల్లో 72 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించడంతో గురువారం ఆట ముగిసే సమయానికి భారత్‌ 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. కోహ్లితో పాటు వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (21 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్‌ బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement