బెంగళూరు
బుల్స్‌పై విజయం
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఏడు వరుస పరాజయాల తర్వాత ఢిల్లీ ఎట్టకేలకు గెలిచింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 35-21తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించి బోణీ చేసింది. ఢిల్లీ తరఫున కాశీలింగ్ (8), సెల్వమణి (7), రవీందర్ (5), సందీప్ (4), అనిల్ కుమార్ (4) మెరుగ్గా ఆడారు. దీపక్ కుమార్ దహియా (5), పవన్ కుమార్ (4), ఆశిష్ సంగ్వాన్ (3), సోమ్‌వీర్ (3)లు బుల్స్‌కు పాయింట్లు అందించారు. బుల్స్ ఆటగాళ్లు రైడింగ్‌తో పాటు క్యాచింగ్‌లోనూ విఫలం కావడం దెబ్బతీసింది. 11వ నిమిషం వరకు ఇరుజట్ల స్కోరు 5-5తో సమమైనా... సెల్వమణి జోరుతో ఢిల్లీ ఆధిక్యం క్రమంగా పెరిగింది. రైడింగ్‌కు వెళ్లిన ప్రతిసారి ఒకటి, రెండు పాయింట్లు సాధించడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 16-7కు చేరింది. తర్వాత బెంగళూరు ఒకటి, రెండు పాయింట్లు సాధించినా కోర్టు ఖాళీ కావడం దెబ్బతీసింది. రెండో అర్ధభాగంలో ఢిల్లీ క్యాచింగ్ మెరుగుపడటంతో పాయింట్లు వేగంగా వచ్చాయి. బుల్స్ జట్టులో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన దహియా అందరికంటే ఎక్కువ పాయింట్లు సాధించడం విశేషం. తాజా విజయంతో ఢిల్లీ ఖాతాలో ఏడు పాయింట్లు సమకూరాయి. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్, పుణేరి పల్టాన్స్‌తో జరిగిన మ్యాచ్ 28-28తో డ్రాగా ముగిసింది. పట్నా తరఫున రోహిత్ కుమార్ అత్యధికంగా 8 పాయింట్లు సాధించాడు. దీపక్ నివాస్ హుడా పుణేకు ఏడు పాయింట్లు అందించాడు.
ఢిల్లీకి తొలి విజయం
Published Fri, Feb 19 2016 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM
Advertisement
Advertisement