
కౌలూన్ (హాంకాంగ్):హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు క్వార‍్టర్స్ లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-14, 21-17 తేడాతో అయా ఒహోరి (జపాన్)పై గెలిచి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది.
ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సింధు ఆద్యంతం పైచేయి సాధించింది. వరుస రెండు గేమ్ లను సునాయాసంగా గెలిచిన సింధు తదుపరి రౌండ్ కు అర్హత సాధించారు. కేవలం 39 నిమిషాల్లోనే సింధు విజయం సాధించి మరొకసారి సత్తాచాటింది. ఒహారీపై తాజా విజయంతో ముఖాముఖి రికార్డును సింధు 3-0 మరింత మెరుగుపరుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment