
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో ఈ ఏడాది చివర్లో పర్యటించనున్న భారత క్రికెట్ జట్టుకు కరోనా వైరస్ ప్రోటోకాల్ ప్రకారం అడిలైడ్‌లో 14 రోజుల క్వారంటైన్ ఏర్పాట్లు చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాత్కాలిక చీఫ్ నిక్ హాక్లీ తెలిపారు. హాక్లీ ప్రకటన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అభిప్రాయానికి విరుద్ధంగా ఉంది. తమ ఆటగాళ్ల నిర్బంధానికి తాము సుముఖంగా లేమని గంగూలీ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే అంతటా అమలవుతున్న నిబంధనల్నే తాము పాటిస్తున్నామని, ఈ నిర్బంధకాలంలో భారత ఆటగాళ్లకు, సహాయ సిబ్బందికి ఏ లోటు రాకుండా సకల సౌకర్యాలు, ఏర్పాట్లు చేస్తామని హాక్లీ చెప్పారు. ఇందుకోసం మ్యాచ్ ఆడే స్టేడియానికి అత్యంత సమీపంలోనే హోటల్ ఉండే వేదికలను పరిశీలిస్తామని హాక్లీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment