ముంబైలో మీడియాతో మాట్లాడుతున్న ద్రవిడ్
ముంబై: అండర్-19లో వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్..పాక్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. పాక్ ఆటగాళ్లలో స్ఫూర్తినింపేందుకు ఆ జట్టు మేనేజర్ నదీమ్ ఖాన్ పిలుపు మేరకు ద్రవిడ్ వారి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ముచ్చటించినట్లు రూమర్లు వ్యాపించాయి. అయితే వీటిని తాజాగా రాహుల్ ద్రవిడ్ ఖండించాడు. వరల్డ్ కప్ గెలిచి సోమవారం స్వదేశానికి వచ్చిన తర్వాత రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. అందులో భాగంగా ఒక విలేకరి నుంచి ఎదురైన ప్రశ్నకు ద్రవిడ్ కూల్‌గా బదులిచ్చాడు.
'నేను పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లలేదు. కేవలం పాక్ జట్టులోని ఒక లెఫార్మ్ పేసర్‌ని మాత్రమే అభినందించా. అది కూడా డ్రెస్సింగ్ రూమ్‌కి బయటే. అంతేకానీ వారి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి వారితో ఎటువంటి చర్చలు జరపలేదు. ఆ క్రమంలోనే పాకిస్తాన్ కోచ్ మన కుర్రాళ్లు బాగా ఆడారని అభినందించారు. అంతవరకూ మాత్రమే జరిగింది' అని ద్రవిడ్ పేర్కొన్నాడు. గత 14-16 నెలల కృషికి లభించిన ఫలితమే ఈ వరల్డ్ కప్ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలిచి వరల్డ్ కప్ గెలిచినప్పటికీ, తుది పోరులో తమ స్థాయికి తగ్గ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయామన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment