కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 142 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన రాజస్తాన్ రాయల్స్‌కు అదిరే ఆరంభం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేపోయింది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పవర్ ప్లే(తొలి ఆరు ఓవర్లలో)లో 68 పరుగులు సాధించింది. కాగా, ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఫలితంగా పవర్ ప్లేలో 60పైగా పరుగులు సాధించి చివరకు అత్యల్ప స్కోరును సాధించిన ఓవరాల్ ఐపీఎల్ జట్ల జాబితాలో రాజస్తాన్ రెండో స్థానంలో నిలిచింది.
ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అరవైకి పైగా పరుగులు సాధించి అత్యల్ప స్కోరును సాధించిన జట్ల జాబితాలో కేకేఆర్(131-2017లో ఆర్సీబీపై) తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాన్ని రాజస్తాన్ ఆక్రమించింది. ఇక మూడో స్థానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్(144-2010లో ముంబై ఇండియన్స్‌పై) ఉండగా, నాల్గో స్థానంలో డెక్కన్ చార్జర్స్(146-2011లో సీఎస్‌కేపై) ఉంది. ఐదో స్థానంలో కేకేఆర్(147-2008లో సీఎస్‌కేపై) నిలిచింది.
మరొకవైపు 50కి పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం వచ్చిన తర్వాత అత్యల్ప స్కోరుకు పరిమితమైన రెండో జట్టుగా కూడా రాజస్తాన్‌నే ఉంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఓపెనింగ్ భాగస్వామ్యం 63 పరుగులు. ఇక్కడ కింగ్స్ పంజాబ్ తొలి స్థానంలో కొనసాగుతుంది. గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 55 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం సాధించినప్పటికీ, 119 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment