
గతకొద్ది రోజులుగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల మధ్య ప్రేమాయణం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సెలబ్రిటీలపై రూమర్స్ కామన్‌గానే వస్తుంటాయి. ఇక క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య ప్రేమయణం అంటే ఆ వార్త హాట్ టాపిక్ కావాల్సిందే. కోహ్లీ-అనుష్క, జహీర్-సాగరిక, హర్భజన్-గీతా, యువీ-హజెల్ వంటివారు కొద్దికాలం ప్రేమలో విహరించి తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
వారి బాటలోనే యువ క్రికెటర్ రిషభ్ పంత్ ఇషా నేగీతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆమెతో జీవితం పంచుకోవాలని కోరుకుంటున్నాడు. జనవరి 1న ఇన్‌స్టాగ్రామ్‌లో ఇషాతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. నీతో కలిసున్నప్పుడు నన్ను నేను మరింత ఇష్టపడతా అని క్యాప్షన్ కూడా పెట్టాడు. అయితే.. ఇటీవల పంత్‌తో టచ్‌లోకి వచ్చేందుకు మాజీ ప్రియురాలు ఊర్వశి చాలాసార్లు ప్రయత్నించినా.. పంత్ ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడటంలేదని తెలుస్తోంది. దీంతో పదేపదే విసిగిస్తుందని అనుకున్నాడో ఏమో కానీ ఆమె నంబర్‌ను వాట్సాప్‌లో బ్లాక్ చేశాడని వార్తలు వస్తున్నాయి. అయితే వారిద్దరూ పరస్పరం చర్చించుకున్నాకే నంబర్లు బ్లాక్ చేసుకున్నారని ఊర్వశి సన్నిహితులు చెప్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment