'టాపార్డర్లో అతనే అత్యుత్తమ బ్యాట్స్మన్' | Rohit a terrific ODI player: Ganguly | Sakshi
Sakshi News home page

'టాపార్డర్లో అతనే అత్యుత్తమ బ్యాట్స్మన్'

Published Tue, Jan 12 2016 7:25 PM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

'టాపార్డర్లో అతనే అత్యుత్తమ బ్యాట్స్మన్'

'టాపార్డర్లో అతనే అత్యుత్తమ బ్యాట్స్మన్'

కోల్కతా: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. విధ్వంసక వన్డే బ్యాట్స్మన్ అని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కితాబిచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలోనే రోహిత్ అత్యుత్తమ టాపార్డర్ బ్యాట్స్మన్ అని అన్నాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో రోహిత్ (171 నాటౌట్) భారీ సెంచరీ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో భారత్ ఓటమి చవిచూసింది.

ఆస్ట్రేలియాతో మ్యాచ్లో రోహిత్ ఇన్నింగ్స్ మొత్తం చూశానని, అద్భుతమైన క్రికెటర్ అని దాదా చెప్పాడు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా రోహిత్లో ఉందని అన్నాడు. ఆసీస్తో తొలి వన్డేలో భారత్ 309 భారీ స్కోరు చేశాక, మన జట్టు గెలుస్తుందని భావించానని.. అయితే ఓటమి ఎదురవడం ధోనీసేనకు నిరాశ కలిగించి ఉంటుందని అన్నాడు. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన భారత యువ పేసర్ బరిందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement