కాన్పూర్:న్యూజిలాండ్ తో ఇక్కడ జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో భారత్ జట్టు తన బ్యాటింగ్ లో పవర్ చూపెడుతోంది. న్యూజిలాండ్ బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ అత్యంత నిలకడగా బ్యాటింగ్ ను కొనసాగిస్తోంది. ప్రధానంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు కివీస్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా శిఖర్ ధావన్(14) ఆదిలోనే పెవిలియన్ కు చేరినప్పటికీ, ఆపై కివీస్ అసలైన సవాల్ మొదలైంది. ఓపెనర్ రోహిత్ శర్మకు జత కలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లిలు సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తొలుత హాఫ్ సెంచరీ చేయగా, ఆపై విరాట్ కోహ్లి అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. అటు తరువాత రోహిత్ శర్మ106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం సాధించాడు. ఇది రోహిత్ కు వన్డేల్లో 15వ సెంచరీ. భారత జట్టు 32.3 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 183 పరుగులు చేసింది. తొలి వికెట్ ను భారత్ జట్టు 29 పరుగుల వద్ద కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment