రోస్‌బర్గ్‌కు పోల్ పొజిషన్
మెర్సిడెస్‌వే తొలి రెండు గ్రిడ్‌లు
వెటెల్‌కు నిరాశ
నేడు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి
మనామా: తొలి రెండు రేసుల్లో దక్కిన విజయాలతో మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు మూడో రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలోనూ దుమ్మురేపేందుకు సిద్ధమయ్యారు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సంపాదించగా... అదే జట్టుకు చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. రోస్‌బర్గ్ మూడో సెషన్‌లో అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 33.185 సెకన్లలో ముగించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు.
డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ పదో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ రికియార్డో మూడో స్థానం పొందినా... గత రేసులో ప్రమాదకరంగా ట్రాక్‌పై దూసుకురావడంతో అతనిపై పది గ్రిడ్‌ల పెనాల్టీని విధించారు. దాంతో అతను ఈసారి 13వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సెర్గియో పెరెజ్ నాలుగో స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 11వ స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. సీజన్‌లోని తొలి రెండు రేసులు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో నికో రోస్‌బర్గ్... మలేసియా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతలుగా నిలిచారు. బహ్రెయిన్‌లోనూ వీరిద్దరిలో ఒకరికి విజయావకాశాలున్నాయి.
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి వివరాలు
ల్యాప్‌ల సంఖ్య : 57
సర్క్యూట్ పొడవు : 5.412 కి.మీ.
రేసు దూరం : 308.238 కి.మీ.
మలుపుల సంఖ్య : 23
ల్యాప్ రికార్డు : 1ని:31.447 సె (రోసా-2005)
గతేడాది విజేత : వెటెల్