ఫైనల్లో రుత్విక, సిరిల్ వర్మ | Rutvika siril varma in Final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో రుత్విక, సిరిల్ వర్మ

Published Sun, Oct 9 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

Rutvika siril varma in  Final

 న్యూఢిల్లీ: నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తూ భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారులు గద్దె రుత్విక శివాని, సిరిల్ వర్మ రష్యా గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించారు. తమ కెరీర్‌లో వీరిద్దరూ తొలిసారి ఓ గ్రాండ్‌ప్రి స్థాయి టోర్నీలో ఫైనల్‌కు చేరారు. రష్యాలోని వ్లాదివొస్తోక్ నగరంలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రుత్విక శివాని 22-20, 21-13తో రెండో సీడ్ సెనియా పొలికర్పోవా (రష్యా)ను ఓడించగా... పురుషుల సింగిల్స్ సెమీస్‌లో సిరిల్ 24-22, 21-16తో అనతోలి యార్ట్‌సెవ్ (రష్యా)పై గెలిచాడు.

మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి తన భాగస్వామి ప్రణవ్ చోప్రాతో కలిసి ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో సిక్కి-ప్రణవ్ ద్వయం 21-11, 21-17తో అనతోలి యార్ట్‌సెవ్-ఎవగెనియా కొసెట్‌స్కాయా (రష్యా) జంటపై నెగ్గింది. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో ఎవగెనియా కొసెట్‌స్కాయాతో రుత్విక శివాని; జుల్ఫాద్లి జుల్‌కిఫ్లి (మలేసియా)తో సిరిల్ వర్మ; ఇవనోవ్-సొరోకినా (రష్యా)లతో సిక్కి-ప్రణవ్ తలపడతారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement