
సత్యసాయికి ప్రియ భక్తుడు
మైదానంలో పరుగుల వరద పారించే సచిన్‌కు భగవంతుడిపై అపార భక్తి విశ్వాసాలు న్నాయి. ముఖ్యంగా పుట్టపర్తి సత్యసాయి బాబా అంటే అతడికి అమిత ఇష్టం. బాబా ఆశీస్సుల కోసం పుట్టపర్తికి ఎన్నో సార్లు వచ్చాడు. ఓసారి బాబా సన్నిధిలోనే జరిగిన యూనిటీ కప్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో సచిన్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. బాబా శివైక్యం వార్త తెలియగానే సచిన్ తట్టుకోలేక పోయాడు.
ఆ సమయంలో ఐపీఎల్ కోసం హైదరాబాద్‌లోనే ఉన్న మాస్టర్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లి పార్థివ దేహాన్ని దర్శించుకున్నాడు. ఈ సమయంలో దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. అదే రోజు తన పుట్టిన రోజైనా ఆ వేడుకలకు దూరమయ్యాడు. అలాగే విఘ్నేశ్వరుడినీ మాస్టర్ అమితంగా ఆరాధిస్తాడు. ఇంట్లో గణేష్‌చతుర్థి వేడుకలను ఘనంగా జరుపుకుంటాడు. అర్ధరాత్రుల్లో అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో గుళ్లను సందర్శించుకుంటాడు. అలాగే మ్యాచ్‌ల కోసం ఆయా ప్రదేశాల్లో పర్యటించినప్పుడు అక్కడి ప్రసిద్ధ ఆలయాలకు వెళుతుంటాడు.