'భారత్'ను కనుగొన్న సచిన్! | Sachin Tendulkar discovers ‘Saare jahan se achcha’ island | Sakshi
Sakshi News home page

'భారత్'ను కనుగొన్న సచిన్!

Published Thu, Jun 30 2016 5:12 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

'భారత్'ను కనుగొన్న సచిన్!

'భారత్'ను కనుగొన్న సచిన్!

న్యూఢిల్లీ: భారతదేశాన్ని కనుగొన్నది వాస్కోడగామా అన్న సంగతి తెలిసిందే. అయితే క్రికెట్ దేవుడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఒక 'భారత్'ను కనుగొన్నాడు. ఏంటి సచిన్ తాజాగా భారత్ ను కనుగొనడం ఏమిటా? అని ఆశ్చర్యపోకండి. సచిన్ కనుగొన్నది  భారత్ను పోలి ఉన్న ఒక చెరువును కనుగొన్నాడు. 

 

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సచిన్.. ఓ ఐస్లాండ్కు వెళ్లిన క్రమంలో అతనికి భారత్ దేశ పటంలా ఉన్న చెరువు కనిపించింది. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. దాన్ని ఫోటోలో రూపంలో బంధించి అభిమానులతో పంచుకున్నాడు. దాని ముందు నిలబడి ఉన్న సచిన్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి 'సారే జహాన్ సే అచ్చా హిందూస్థాన్ హమారా' అనే క్యాప్షన్ కూడా జోడించి దేశంపై అభిమానాన్ని చాటుకున్నాడు. 'తాను కొన్ని దీవుల్ని సందర్శించేటప్పుడు  ఓ చెరువు కనిపించింది. అది అచ్చం భారతదేశ పటంలానే ఉంది' అని సచిన్ పేర్కొన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement