ముంబై xహర్యానా రంజీ మ్యాచ్
ఉ. గం. 9. 30 నుంచి
స్టార్ స్పోర్ట్స్-2లో
ప్రత్యక్ష ప్రసారం
సచిన్...సచిన్...
మాస్టర్ ఆఖరి ‘రంజీ’ మ్యాచ్‌పై అందరి దృష్టి
నేటి నుంచి హర్యానాతో ముంబై పోరు
లాహ్లి (రోహ్‌టక్): సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి...ఆ తర్వాత రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన తర్వాత క్రికెట్ ప్రపంచంలో ఒక్కసారిగా ఉత్సుకత పెరిగిపోయింది. అభిమానులు అందరూ ఎదురు చూస్తున్న ఆ రోజు ఇప్పుడు రానేవచ్చింది. హర్యానాలోని ఈ చిన్న పట్టణం ఇప్పుడు ఒక్కసారిగా వార్తలకు కేంద్ర బిందువైంది. ఇక్కడి చౌదరి బన్సీలాల్ స్టేడియంలో ఆదివారం ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మాస్టర్ బరిలోకి దిగనున్నాడు.
ఇక్కడ జరిగే మ్యాచ్‌లో రంజీ డిఫెండింగ్ చాంపియన్ ముంబై, హర్యానాతో తలపడుతుంది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు సచిన్ ఆడనున్న మ్యాచ్ కావడం, ఇదే తన ఆఖరి రంజీ మ్యాచ్ అని కూడా మాస్టర్ ప్రకటించడంతో దీనిపై అందరి దృష్టి నిలిచింది. శనివారం నెట్స్‌లో సచిన్ బ్యాటింగ్ లో తీవ్ర సాధన చేశాడు. సహచరులతో ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న అతను కొద్ది సేపు బౌలింగ్ కూడా చేయడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కెనాల్ రెస్ట్ హౌస్ వీఐపీ సూట్‌లో ఈ దిగ్గజ క్రికెటర్‌కు బస ఏర్పాటు చేశారు.
చివరి టెస్టుకు తేలికైన బ్యాట్లు
జలంధర్: సచిన్ టెండూల్కర్ ఆడబోతున్న చివరి టెస్టు కోసం ప్రత్యేక బ్యాట్లు సిద్ధం కాబోతున్నాయి. కెరీర్‌లో చాలా కాలంగా... మాస్టర్ వాడే బ్యాట్లను తయారు చేస్తున్న స్థానిక స్పోర్ట్స్ కంపెనీ వాంఖడే టెస్టు కోసం కూడా రెండు బ్యాట్లను అందుబాటులో ఉంచనుంది. అయితే ఇవి మామూలుగా సచిన్ వాడే బ్యాట్లకన్నా 35 నుంచి 40 గ్రాముల వరకు తేలికగా ఉంటాయని బీట్ ఆల్ స్పోర్ట్స్ భాగస్వామి సోమి కోహ్లి తెలిపారు.
టెండూల్కర్ ‘ఫేర్‌వెల్’
Published Sun, Oct 27 2013 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement