క్వార్టర్స్‌లో సైనా | Saina Nehwal wins, PV Sindhu loses at India Open | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సైనా

Published Fri, Apr 4 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM

క్వార్టర్స్‌లో సైనా

క్వార్టర్స్‌లో సైనా

జ్వాల-అశ్విని ఓటమి
 ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్
 
 న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో ఎట్టకేలకు రెండోరౌండ్ హర్డిల్ దాటింది. గత మూడు టోర్నీల్లోనూ రెండో రౌండ్ దాటని సైనా.. ఈ సారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్స్‌లో సైనా 21-15, 21-12తో నచా సయెంగ్‌చొట్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. తొలి గేమ్ ఆరంభంలో సైనా 2-5తో వెనకబడినప్పటికీ... ఆ తర్వాత నిలదొక్కుకుని 11-8తో ఆధిక్యంలో నిలిచింది. అయితే సైనా చేసిన అనవసర తప్పిదాలను తనకు అనుకూలంగా మలుచుకున్న నచా స్కోరును 12-12తో సమం చేసింది.
 
 ఇద్దరు పోరాడటంతో స్కోరు 15-15కు చేరుకుంది. ఈ దశలో సైనా ఆరు పాయింట్లు సాధించి 21-15తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో నచా అనవసర తప్పిదాలు చేయడంతో సైనా 11-3తో పైచేయి సాధించింది. ఈ సమయంలో నచా పోరాడటంతో స్కోరు 17-12కు చేరుకుంది. అయితే సైనా వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 21-12తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను నెగ్గింది.
 
 కశ్యప్ జోరు...
 మరోవైపు పురుషుల సింగిల్స్‌లో తెలుగుతేజం కశ్యప్ జోరు కొనసాగుతోంది. రెండో రౌండ్‌లో కశ్యప్ 21-15, 16-21, 21-11తో గురుసాయిదత్‌పై నెగ్గాడు. మరో భారత ఆటగాడు సౌరభ్ వర్మకు నిరాశ ఎదురైంది. టాప్‌సీడ్ లీ చోంగ్  వీ (మలేసియా) 21-9, 21-6తో సౌరభ్ వర్మను చిత్తు చిత్తుగా ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో కశ్యప్-లీ చోంగ్ వీ పోటీపడనున్నారు. ఇక మహిళల సింగిల్స్‌లో తృప్తి ముర్గుండె, సయాలీ గోఖలె రెండో రౌండ్లో వెనుదిరగ్గా... డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప 13-21, 19-21 తేడాతో కింగ్ టియాన్- యున్‌లీ జావో (చైనా) చేతిలో ఓటమిపాలయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement