లార్డ్స్లో మూడో వికెట్ కీపర్గా.. | Sarfraz Ahmed becomes only the third wicket-keeper to score ODI ton at Lord's | Sakshi

లార్డ్స్లో మూడో వికెట్ కీపర్గా..

Published Sun, Aug 28 2016 4:10 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

లార్డ్స్లో మూడో వికెట్ కీపర్గా.. - Sakshi

లార్డ్స్లో మూడో వికెట్ కీపర్గా..

పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

లార్డ్స్: పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. చారిత్మాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ నమోదు చేసిన మూడో వికెట్ కీపర్గా సర్ఫరాజ్ నిలిచాడు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో సర్పరాజ్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో సర్పరాజ్(105) శతకం సాధించాడు.  తద్వారా అంతకుముందు వన్డేల్లో
ఈ మైదానంలో సెంచరీలు చేసిన వికెట్ కీపర్లు జాస్ బట్లర్, సంగక్కరాల సరసన సర్ఫారాజ్ నిలిచాడు.

ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 251 పరుగులు చేసింది. అనంతరం తరువాత బ్యాటింగ్ చేసిస ఇంగ్లండ్ నాలుగు వికెట్లు తేడాతో విజయం సాధించింది. దీంతో వన్డే సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement