41బంతుల్లో సెంచరీ | Scotland Beat Netherlands by 7 wickets | Sakshi
Sakshi News home page

41బంతుల్లో సెంచరీ

Published Tue, Sep 17 2019 2:40 AM | Last Updated on Tue, Sep 17 2019 2:53 AM

Scotland Beat Netherlands by 7 wickets - Sakshi

డబ్లిన్‌: స్కాట్లాండ్‌ ఓపెనర్‌ హెన్రీ జార్జ్‌ మున్సే టి20 క్రికెట్‌లో రికార్డులతో అదరగొట్టాడు. ముక్కోణపు టి20 టోరీ్నలో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మున్సే 41 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో మున్సే 56 బంతుల్లో 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో మున్సే రెండో స్థానంలో నిలిచాడు. మున్సే, కెపె్టన్‌ కోయిట్జర్‌ (50 బంతుల్లో 89; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌కు 91 బంతుల్లోనే 200 పరుగులు జోడించారు. ఇది ఏ వికెట్‌ౖకైనా మూడో అత్యుత్తమ భాగస్వామ్యం. వీరిద్దరి ధాటికి స్కాట్లండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 252 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసి 58 పరుగుల తేడాతో ఓడిపోయింది.

మున్సే రికార్డులు 
►41 బంతులు: ఫాస్టెస్ట్‌ సెంచరీ జాబితాలో రెండో స్థానం. డేవిడ్‌ మిల్లర్‌ (దక్షిణాఫ్రికా), రోహిత్‌ శర్మ (భారత్‌), సుదేశ్‌ విక్రమశేఖర (చెక్‌ రిపబ్లిక్‌) 35 బంతుల్లోనే సెంచరీ సాధించారు.   

►14 సిక్సర్లు:  ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌లో రెండో స్థానం. గతంలో హజ్రతుల్లా జజాయ్‌ (అఫ్గానిస్తాన్‌) 16 సిక్సర్లు కొట్టగా... ఫించ్‌ కూడా 14 సిక్సర్లు బాదాడు.  

►32 పరుగులు: మ్యాక్స్‌ ఒ డౌడ్‌ వేసిన ఒక ఓవర్లో మున్సే 32 పరుగులు (6,4,4,6,6,6) కొట్టాడు. యువరాజ్‌ సింగ్‌ (36) తర్వాత ఒక ఓవర్లో బ్యాట్స్‌మన్‌ సాధించిన అత్యధిక పరుగులు ఇవే. గతంలో మరో మూడు సందర్భాల్లో ఒకే ఓవర్లో 32 పరుగులు వచ్చినా...అవి ఒకే బ్యాట్స్‌మన్‌ చేయలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement