అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) లో సభ్యత్వం కోసం భారత్ నుంచి నామినేట్ అయిన రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీకి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభినందలు తెలియజేశారు.
ముంబై: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) లో సభ్యత్వం కోసం భారత్ నుంచి నామినేట్ అయిన రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీకి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభినందలు తెలియజేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్లో షారూక్ అభినందించాడు. 'ఐఓసీలో సభ్యత్వం కోసం నీతా నామినేట్ కావడం నిజంగా అద్భుతం. ఇటువంటి అరుదైన అవకాశం దక్కడం అభినందనీయం 'అని షారూక్ పేర్కొన్నాడు. మరోవైపు నీతా అంబానీకి హాకీ ఇండియా(హెచ్ఐ)కూడా అభినందనలు తెలియజేసింది.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ లో సభ్యత్వం కోసం నీతా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 2 నుంచి 4 వరకు రియో డి జనీరోలో జరిగే ఐఓసీ సెషన్‌లో ఈ ఎన్నిక జరుగుతుంది. ఒకవేళ నీతా ఎన్నికైతే భారత్ నుంచి ఐఓసీలో చోటు దక్కించుకున్న తొలి మహిళగా ఘనత సాధిస్తారు. ఒకసారి ఎన్నికైతే ఆమెకు 70 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఐఓసీలో సభ్యురాలిగా ఉండే అవకాశం ఉంది.