'ఆలియా.. నిన్ను చాలా మిస్సవుతున్నా' | Shikhar Dhawan Posts Dance Video With Daughter On Her Birthday | Sakshi
Sakshi News home page

'ఆలియా.. నిన్ను చాలా మిస్సవుతున్నా'

May 6 2020 10:38 AM | Updated on May 6 2020 11:10 AM

Shikhar Dhawan Posts Dance Video With Daughter On Her Birthday - Sakshi

ఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో క్రీడలన్నీ వాయిదా పడడంతో ఆటగాళ్లంతా ఇళ్లకు పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపేస్తున్నారు. కొందరు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి పెడతుంటే మరికొందరు డ్యాన్స్‌లు, ఇంటర్య్వూలతో కాలం గడిపేస్తున్నారు. అయితే భారత ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ మాత్రం తన కుటుంబసభ్యులతో గడిపిన క్షణాలను ఒక్కొక్కటిగా షేర్‌ చేసుకుంటున్నాడు. తాజాగా ధవన్‌ తన కూతురు ఆలియా బర్త్‌డే సందర్భాన్ని పురస్కరించుకొని ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. తన కూతురు ఆలియాతో కలిసి ఇంతకుముందు చేసిన డ్యాన్స్‌ను  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 'హ్యపీ బర్త్‌డే మై ఏంజెల్‌!! నీ జీవితంలో ఇలాంటి వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నా.. నేను నిన్ను చాలా మిస్సవుతున్నా తల్లీ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పుట్టిన రోజును ఆనందంగా జరుపుకో అంటూ ' క్యాప్షన్‌ జత చేశాడు. (పుజార.. బంతి కోసం పరిగెత్తాల్సి ఉంటుంది)

దీనికి ఆలియా స్పందిస్తూ.. 'థాంక్యూ నాన్న.. ఈ వీడియో షేర్‌ చేసి నాకు ఎప్పటికి గుర్తుంచుకునేలా చేశావు. ఐ లవ్‌ యూ సో మచ్‌ పప్పా.. నేను కూడా నిన్ను చాలా మిస్సవుతున్నా' అంటూ పేర్కొంది. కాగా శిఖర్‌ ధవన్‌కు ఆలియా స్టెప్‌ డాటర్‌ అన్న సంగతి తెలిసిందే.(విరాట్‌ ఇంట విషాదం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement